గణనాధుని ఆశీస్సులతో చేనేత రంగం వృద్ధి చెందాలి
1 min read
రామారావు కాలనీ చేనేత నాయకులు పురుం సహదేవ ఆకాంక్ష
గణపతి కి ప్రత్యేక పూజలు
మదనపల్లె , న్యూస్ నేడు : గణనాధుడి కృపతో చేనేత రంగం అభివృద్ధి సాధించా లని,చేనేత కార్మి కుల జీవితాల్లో వెలుగులు నింపాలని మదనపల్లె పట్టణం, రామారావు కాలనీ కి చెందిన చేనేత నాయకులు పురుం సహదేవ వేడు కొన్నారు . వినాయక చవితి సందర్బంగా కుటుంబ సభ్యులు, చేనేత కార్మికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశం లో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారని, అయితే ప్రస్తుతం చేనేత రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముడి సరుకు ధరలు పెరిగి పోయాయని, పట్టు చీరలకు డిమాండ్ లేదన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతు, కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టు రాయితీ తోపాటు, సబ్సిడీ రుణాలు అర్హులైన వారికి మంజూరు కావడం లేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమా నికి ప్రత్యేక చొరవ చూపాలని,నీరుగట్టువారిపల్లి పట్టు చీరలకు బ్రాండ్ ఇమేజ్ ఇవ్వాలని, వినాయకుడి ఆశీస్సులతో చేనేత రంగానికి పూర్వ వైభవం సంతరించు కోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పురం గాయత్రి, పురం సందీప్, నాగభూషణ్ రెడ్డి, దేవేంద్ర,రెడ్డెప్ప,ఆదిమూర్తి,శంకర్ రెడ్డిచేనేత కార్మికులు పాల్గొన్నారు.


