పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత
1 min read
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం
పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయాలి
నంద్యాలలో పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రోత్సాహం.. ఎంఎస్ఎంఈలకు విస్తృత ప్రచారం
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పరిశ్రమల పరిధిలోని స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించిన భూ సమస్యలు, పర్యావరణ అనుమతులు, వెబ్‌ల్యాండ్ నవీకరణలు, పెట్టుబడి ప్రాజెక్టులు, ఎంఎస్ఎంఈలు, పర్యాటకాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రెయిన్ సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, తాగునీటి సమస్యలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని పరిశ్రమల బృంద సభ్యులను ఆదేశించారు. శ్రీశైలం సీ ప్లేన్ టెర్మినల్‌కు సంబంధించి డిసెంబర్‌లోగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని, హెలిపోర్ట్‌కు అవసరమైన భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎన్. అరుణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


