రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
1 min read
పెండింగ్ లో ఉన్న రీ సర్వే, 22 ఏ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ఫేజ్–6 గ్రౌండ్ ట్రూథింగ్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు..బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో రెవెన్యూ అంశాల పై ఆర్డీఓ లు, తహసిల్దార్లు, రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ లతో జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రీ సర్వే, 22 ఏ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇప్పటివరకు 22ఏ కింద దాదాపు 3,000 కేసులను పూర్తి చేసినప్పటికీ, వెబ్‌ల్యాండ్ 2.0లో అవసరమైన మార్పులు చేయాల్సి ఉన్నందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శనివారం నాటికి తహసీల్దార్లు అందరూ జాయింట్ కలెక్టర్ అనుమతి కోసం సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సర్వే కి సంబంధించి ఫేజ్–4లో తహసీల్దార్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు ఎన్ని బృందాలు ఎంత మేరకు సర్వే పనులు పూర్తి చేస్తున్నాయో క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలన్నారు..రెవెన్యూ అంశాల పై ప్రజల్లో సానుకూల ప్రజాభిప్రాయం (Positive Public Perception) మెరుగుపడేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రశ్నలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందించి, ప్రభుత్వ సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రెవెన్యూ విభాగానికి సంబంధించి రీ-ఓపెన్ శాతం 9.5 శాతంగా ఉందని, దీనిని గణనీయంగా తగ్గించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు..సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి ఆర్ ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, పత్తికొండ ఆర్డిఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, సర్వేయర్ ఏడి మురళి కృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియం వద తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.



