NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో సినీ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కోడలు, ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్ సిఎస్ ఆర్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన గురువారం ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రాలయం వచ్చారు. వీరికి మఠం అధికారులు శ్రీ పతి, జోనల్ మేనేజర్ ఐపీ నరసింహ స్వామి, కుశలకర్ణి స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు పట్టు చీర మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. మంత్రాలయం చుట్టూ పక్కల నిరుపేద ప్రజల కు, భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రి ఏర్పాటు చేయాలని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఉపాసన ను కోరారు. ఇందుకు స్పందించిన ఆమే ఆలోచిస్తానని తెలిపారు. వీరి వెంట వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. సిఐ దస్తగిరిబాబు, మంత్రాలయం ఎస్సై మల్లికార్జున, మాధవరం ఎస్సై విజయ కుమార్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ భార్య ఉపాసన రావడం తో అబిమానులు చూసేందుకు విరగబడ్డారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *