రిపోర్టర్ల పై దురుసుగా ప్రవర్తించిన సీఐ ను సస్పెండ్ చేయాలి
1 min read
జర్నలిస్టులపై దాడులు ,కేసులను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ కౌతాళం
కౌతాళం న్యూస్ నేడు: మండల కేంద్రమైన తహసిల్దార్ కు ఏపిడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. పత్తికొండలో విశాలాంధ్ర విలేఖరి నాగరాజు పై దురుసుగా ప్రవర్తించిన అర్బన్ సీఐ జయన్న ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏపీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కౌతాళం లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సిఐ జయం నన్ను సస్పెండ్ చేయాలని నంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్ల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ రజనీకాంత్ రెడ్డి కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిడబ్ల్యూజే కౌతాళం మండల అధ్యక్షులు అంజి, తాలుక సహ కార్యదర్శి ఆరిఫ్, ప్రధాన కార్యదర్శి కాకం రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షులు శివకుమార్ సాదిక్ ,రాముడు, యూనియన్ కమిటీ సభ్యులు ముక్తార్ భాష, మహమ్మద్ దనీఫ్,రామ్మూర్తి, జర్నలిస్టులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


