మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు అభ్యర్డులనుండి దరఖాస్తులకి ఆహ్వానం
1 min read
ఈనెల 28వ తేదీలోగా చేరు విధముగా పంపవలసింది
జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్.వి.ఎస్.ఎస్. ప్రసాద్
రిజర్వాయర్లలో చేపలు పెంపకము గురించి బోధన,మరియు ప్రాక్టికల్ తో కూడిన కోర్స్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బాదంపూడి లోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం నందు శిక్షణ పొందుటకు అభ్యర్డులనుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్.వి.ఎస్.ఎస్. ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా చిరునామాకు ఈనెల 28వ తేదీలోగా చేరు విధముగా పంపవలసిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలోని వారికి, మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘముల సభ్యులు చేపల పెంపకము నందు ఆసక్తి కలిగిన ఇతరులు, షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఈ శిక్షణ పొందుటకు అర్హులన్నారు. ఉపకార వేతనము లేకుండా 20 సీట్లు కలవని, ఈనెల 30వ తేదీ ఉదయం 11.00 గంటలకు మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయములో జరపడునని, ఇంటర్వ్యూలో ఎంపిక అయినవారు పేర్లు అదే రోజు సాయంత్రం 4.00 గంటల తరువాత కార్యాలయము నోటీసు బోర్డు లో తెలియజేయడం జరుగుతుందన్నారు. శిక్షణ కాలము మూడు నెలలని, శిక్షణ కాలములో మత్స్య క్షేత్రములు మరియు రిజర్వాయర్లలో చేపలు పెంపకము గురించి బోధన ,మరియు ప్రాక్టికల్ తో కూడిన కోర్సు బొదించబడుతుందన్నారు.. శిక్షణాంతరము పరిక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన విద్యార్దులకు సర్టిఫికేట్లు ఇవ్వబడుతుందన్నారు. విద్యార్హతలు : 5వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ప్రాదాన్యత తెలుగులో చదవను, వ్రాయనూ తెలిసిన వారికి కూడా అవకాశము ఇవ్వబడునని, 18 సంవత్సరములు నుండి 30 సంవత్సరములు మద్య వయసు వారు అర్హులని,ఎంపిక కమిటి ప్రత్యేక పరిగణనలో వయస్సు పరిమితిని సడలించవచ్చునన్నారు. సహాయ పరిశీలకులు మత్స్యశాఖ హోదాకు తగ్గకుండా మత్స్యశాఖ అధికార్ల నుండి పొందిన అనుభవము సర్టిఫికేట్లు దరఖాస్తుతో జతపరిచి పంపాలన్నారు. సదరు దరకాస్తు ఫారము సమాచారము సంబందిత జిల్లా మత్స్యశాఖ అదికారి ఏలూరు / మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయములో లబించునని, ఇంటర్వ్యూఇకు హాజరుయ్యే అభ్యర్డులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లు విధిగాతీసుకురావాలన్నారు. ఇతర వివరములకు మత్స్య శాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి (సెల్ నెం.8019383640) మత్స్యశాఖ అధికారి, బాదంపూడి- 1 (సెల్ నెం. 7286993033), మత్స్యశాఖ అధికారి, బాదంపూడి- 2 (సెల్ నెం.8341682644) వారిని కార్యాలయము పనివేళల్లో సంప్రదించవచ్చన్నారు.


