NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తన పదవీకాలంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కారుణ్య నియామకాలు అందించాం

1 min read

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

అర్హులైన ప్రతీ ఒక్కరికీ కారుణ్య నియామకాలు అందించాం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి   జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా  తన పదవీకాలంలో 130 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఘంటా  పద్మశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతను  ఇచ్చామన్నారు. జిల్లా పరిషత్ సమావేశాలలో జెడ్పిటిసి లు తెలియజేసిన  గ్రామాలలోని ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సహకరించిన జెడ్పిటిసి లు, ఎంపీపీలకు ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కృతఙ్ఞతలు తెలియజేసారు.  తన పదవీకాలంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కారుణ్య నియామకాలు అందించామని, అర్హత ఉంది ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకోని వారికి పదోన్నతులు కల్పించామన్నారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పిటిసి లు తమకు గౌరవ వేతనాలు అందలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.  ఈ సందర్భంగా జెడ్పిటిసి లను పూలదండ, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి, మెమెంటో లను అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ని ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు,  జిల్లా పరిషత్తు ఇంచార్జ్  సీఈఓ మల్లికార్జునరావు,  డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్ గారు, జడ్పీటీసి సభ్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *