NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి మేజర్ పంచాయతీలో ఎంపిటిసి,జడ్పిటిసి తుది ఓటర్ల జాబితా ప్రచురణ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలానికి సంబంధించిన ఎంపిటిసి, జడ్పీటిసి  తుది ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియను ప్యాపిలి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన తుది ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలన కోసం గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డుపై అధికారికంగా ప్రదర్శించారు.ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకునేందుకు వీలుగా తుది జాబితాలను నోటీసు బోర్డుపై అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ వై. ప్రభాకర్,ఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో   గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *