సిపిఐ ఆధ్వర్యంలో రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం
1 min read
సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో భూగర్భంలో ఉన్న బొగ్గు వెలుకతీత పనులకు రిలయన్స్ కంపెనీ పూనుకుంటున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శ మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. బొగ్గు వెలుకతీతపై రైతులలో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలు గురించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈనెల 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితర నాయకులు పాల్గొంటున్నారు. రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలుపవలసిందిగా ఆయన కోరారు.


