NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కృష్ణా జలాలు కరువు సీమ రైతన్నకు భరోసా

1 min read

ప్రజలకు జీవనాధారం- కృష్ణా జలాలకు  చిప్పిలిలో జలహారతి

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : కరువు సీమకు కృష్ణా జలాలు చేరుకున్న శుభ సందర్భంగా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద మదనపల్లె కూటమి పార్టీ ల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా శనివారం జలహారతి కార్య క్రమం నిర్వ హించారు. భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి నాయ కులు జలహారతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహా రెడ్డి, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, విజయభారతి విద్యాసంస్థల అధినేత డా. నల్లు సేతు స్వామి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ, విశ్వ బ్రాహ్మణ కార్పొ రేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామ కృష్ణ, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండ్యం ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండి ఆనంద్, జనసేన రాయలసీమ కన్వీనర్ రామదాసు చౌదరి, జనసేన నాయకురాలు దారం అనిత, మార్కెట్ చైర్మన్ జంగాల శివరామ్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి(షో ఆఫ్ శీను) బీజేపీ మైనారిటీ నాయకులు డా. అజ్మతుల్లాఖాన్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కృష్ణా జలాల రాకతో ప్రజలకు సాగు తాగునీటి కష్టాలకు తెరపడిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చలవతోనే ఇది సాధ్యమైందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, రైతులు సంక్షేమం చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం తోనే పరుగులు పెడుడుతోందని పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *