స్వచ్ఛత, పోషణపై అవగాహన ర్యాలీలు
1 min read
ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవా–2026, SASA కార్యక్రమం, ఐసిడిఎస్ పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా అవగాహన ర్యాలీలుఈఓ నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ వై. ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛత, పారిశుధ్యం, పోషకాహారం, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ, పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది, స్వర్ణ గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


