NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా ఎల్లార్తి అర్జున్ నియామకం

1 min read

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: బీసీవై జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్

హోళగుంద న్యూస్ నేడు: బీసీవై పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి వాల్మీకి అర్జున్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి పర్యటనల సమన్వయం, పార్టీలో చేరికలను ప్రోత్సహించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం వంటి బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయిలో తనకు బాధ్యత కల్పించిన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్‌కు ఎల్లార్తి అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బీసీవై పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు యువకులు, మహిళలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కృషి చేస్తామని తెలిపారు.కర్నూలు జిల్లాలో బీసీవై పార్టీలో చేరేందుకు ఆసక్తి ఉన్న యువకులు, మహిళలు, సీనియర్ నాయకులు, ఇతర వర్గాల వారు తనను సంప్రదించాలని ఎల్లార్తి అర్జున్ కోరారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

About Author