కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా చేయాలి
1 min read
పట్టణంలో సీపీఐ ఎంఎల్ పార్టీ ధర్నా..
నందికొట్కూరు న్యూస్ నేడు: కేంద్ర ఎన్నికల ప్రధానా ధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశరు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోశనివారం అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుండి తొలగించాలని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ప్రజా,ప్రతిపక్ష నాయకులు విద్యార్థులు చేపట్టిన నిరసనలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ నిరసనల్లో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య,యోగేంద్ర యాదవ్ తదితరులను పోలీసులు నిర్బంధించడం దారుణం.జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వారిని అడ్డుకోవడం, నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడని తెలిపారు.ప్రత్యేకించి ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నేపథ్యంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉన్న ప్రజల ఆందోళనలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉంది.ఇప్పటికే రాష్ట్రాల్లో అనేక ఓట్లు సర్ పేరుతో తొలగించారని నిజమైన ఓటర్లు ఓటు హక్కు లేక ఇబ్బందులకు గురైన పరిస్థితి ఎదురౌ తుందన్నారు.ఓటు హక్కును తొలగించే హక్కు ఎన్నికల కమిషన్ కు గాని కేంద్ర ప్రభుత్వానికి గాని లేదన్నారు.తక్షణమే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సోమన్న,పి నరసింహులువేల్పుల ఏసన్న,మేకల చంద్రశేఖర్, వడ్డే శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


