NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాక్ ఇంటీరియర్ డెకర్, తారా డిజైనర్ బోటిక్ నూతన వ్యాపారం ప్రారంభోత్సవం

1 min read

ముఖ్య అతిథిగా  ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) 

వ్యాపార అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలి. ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక జిల్లా పరిషత్ కాంప్లెక్స్ నందు రాక్ ఇంటీరియర్ డెకర్ మరియు తారా డిజైనర్ బోటిక్ నూతన వ్యాపార ప్రారంభోత్సవo యాజమాన్య నిర్వాహకులు  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విచ్చేసి నూతన వ్యాపారాన్ని ప్రారంభోత్సవం చేశారు. వ్యాపార అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎ యం సి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టి డి పి నాయకులు మాజీ విప్ గూడవల్లి శ్రీనివాస్,ఆర్ ఎన్ ఆర్ నాగేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

About Author