NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పగిడ్యాలలో బాల సంజీవని కిట్లు పంపిణీ

1 min read

అక్టోబర్ 7 వరకు మాసో త్సవాలు

నందికొట్కూరు న్యూస్ నేడు: గర్భవతులు బాలింతలు బాల సంజీవని కిట్లను సద్వినియోగం చేసుకోవాలని పగిడ్యాల ఎంపీడీవో సుమిత్రమ్మ అన్నారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో సంకిరేణి పల్లె,బీరవోలు ఆంజనేయ నగర్ అంగన్వాడి కేంద్రాల్లో జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు సూపర్ వైజర్ ఎం.శేషమ్మ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూప్రతి అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా ఉండాలని కిట్లలో ఉండే పదార్థాలను వృధా చేయకుండా వాటిని వాడితే మీరు ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శివకుమార్ మాట్లాడుతూ  అంగన్ వాడిలో పిల్లలకు మంచిగా పౌష్టికాహారం ఇవ్వాలని ప్రీస్కూల్ హాజరు మెరుగుపరచాలన్నారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయటం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని 18 సం.లు నిండిన తర్వాతనే బాలికలకు పెళ్లి చేయాలని అదేవిధంగా గర్భవతులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు ఈ మాసోత్సవాలు అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్నట్లు సూపర్వైజర్ తెలిపారు. తర్వాత అధికారులు కిట్లను పంపిణీ చేసి గర్భవతులను మరియు అంగన్వాడీ కార్యకర్త మల్లేశ్వరిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అబ్దుల్ రహీం, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి లక్ష్మి రత్నమ్మ, టిడిపి నాయకులు శ్రీనివాసులు,మల్లయ్య, అంగన్వాడి కార్యకర్తలు పద్మావతి,శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

About Author