NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్టీసీ లో ఉద్యోగ భద్రత సర్క్యులర్ ను అమలు చేయాలి

1 min read

ఉల్లంఘిస్తున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టుల భర్తీ చేయాలి

ఇయు రాష్ట్ర అధ్యక్షులు పలి శెట్టి దామోదర్ రావు డిమాండ్

మదనపల్లె ,  న్యూస్ నేడు ప్రతినిధి : ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణగా ఉన్న ఉద్యోగ భద్రత సర్కులర్ 01/2019 ను రాష్ట్ర వ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలని,వీసీ అండ్ ఎండీ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సర్క్యులర్‌ను ఉల్లంఘించే అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని, ఉద్యోగులపై ఏకపక్ష చర్యలకు పాల్పడితే ఇయు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. శనివారం మదనపల్లె పట్టణం లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్‌లో ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్.పి.బాబు అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి బి.సాంబ శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగులపై చర్యలు తీసుకునే సందర్భాల్లో ఉద్యోగ భద్రత సర్కులర్ 01/2019లోని నిబంధనలను అధికారులు తప్పని సరిగా పాటించాల న్నారు.సర్కులర్ అమలుపై వీసీ అండ్ ఎండీ స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా వాటిని ఉల్లంఘిస్తే ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.ఉద్యోగ భద్రత సర్కులర్ అమలు ఉద్యోగుల కు ఎవరో ఇచ్చే రాయితీ కాదు. అమల్లో ఉన్న నిబంధనలను గౌరవించడం అధికారుల బాధ్యత అన్నారు. మన ఐక్యతే మన బలం – ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ఇ.యు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇ.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎన్.బి.రెడ్డి,రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్.వి.కుమార్, కడప జోన్ జోనల్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్,జోనల్ నాయకులు వి.టి.నాథ్,జి.సుబ్రహ్మణ్యం,జిల్లా నాయకులు పివి.భయారెడ్డి,కెవి.రమణ,మధు,జివి రమణ,చలమారెడ్డి,బి.శరత్ బాబు, ఏఎస్.అలి,సెల్వి,కె.ఎల్.దేవి,సుగుణ,శారద, రాయచోటి,పీలేరు,పుంగనూరు,మదనపల్లి-1 అండ్ 2 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు,వర్కింగ్ ప్రెసిడెంట్స్, గ్యారేజ్ సెక్రటరీలు, ట్రెజరర్స్,డిపో నాయకులు,మెయింటెనెన్సు కమిటీ మెంబెర్, ముఖ్య కార్య కర్తలు,ట్రాఫిక్ అండ్ గ్యారేజి ఉద్యోగులు, సిసిఎస్ డెలిగేట్లు, మహిళలతో సహా సుమారు 400 మంది ఇ.యు శ్రేణులు పాల్గొన్నారు.

About Author