సంఘ సంస్కరణకు వెలుగు జాడ గురజాడ
1 min read
డా.బూసి వెంకటస్వామి
- గురజాడ జాతీయ సదస్సు విజయవంతం
పాలకొల్లు, న్యూస్ నేడు :రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని చైతన్య సారస్వత పరిషత్ (రాజమహేంద్రవరం), తెలుగు భాషా చైతన్య సమితి (హైదరాబాద్), కుసుమ ధర్మన్న కళాపీఠం (హైదరాబాద్) సంస్థల సంయుక్త నిర్వహణలో జాతీయ కవి సమ్మేళనం, “గురజాడ సాహిత్య సమాలోచన” జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రారంభ సమావేశంలో పాలకొల్లు శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎమ్. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా. బూసి వెంకటస్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొని గురజాడ సాహిత్య వైశిష్ట్యాన్ని, నేటి సమాజానికి ఆయన రచనల ఆవశ్యకతను విశ్లేషించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన “సంఘ సంస్కరణకు వెలుగు జాడ గురజాడ” అనే అంశంపై సమర్పించిన పరిశోధనా పత్రం సదస్సులో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురజాడ సాహిత్యం సమాజంలో తెచ్చిన మార్పులను, ఆయన సంస్కరణాభిలాషను వివరించిన డా బూసి వెంకటస్వామిని విశ్వవిద్యాలయం కులపతి, కిమ్స్ డైరెక్టర్ శ్రీ కె వి వి సత్యనారాయణ రాజు (చైతన్య రాజు), వైస్ ఛాన్స్లర్ డా యు చంద్రశేఖర్, ప్రో వైస్ ఛాన్స్లర్ డా కె విబి రాజు, రిజిస్ట్రార్ డా పిఎమ్ఎస్ఎస్ శర్మ, డీన్ డా కె వల్లి మాధవి,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రెక్టర్ ఆచార్య పి వరప్రసాద్ మూర్తి,సమైక్య భారతి జాతీయ అధ్యక్షులు పి కన్నయ్య, గోదావరి జిల్లా సాహితీ మిత్రులు నల్లా నరసింహమూర్తి , డా రాధా కుసుమ, పి బడే సాబ్, సదస్సు కన్వీనర్ డా తరపట్ల సత్యనారాయణ, డా పి వి బి సంజీవరావు తదితర ప్రముఖులు మెమెంటో ,శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది వెంకటస్వామికి అభినందనలు తెలియజేశారు.


