చరిత్రను తెలుసు కుంటూ వారసత్వ సంపదను కాపాడు కుందాం
1 min read
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గుర్రంకొండ కోటలో హెరిటేజ్ వాక్
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఈ నెల 27న నిర్వ హించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్నమయ్య జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం గుర్రంకొండ లో హెరిటేజ్ వాక్ నిర్వహించారు.జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుర్రంకొండ కోట నుంచి కొండపై ఉన్న కోట ప్రాంతం వరకు హెరిటేజ్ వాక్ నిర్వ హించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గుర్రంకొండ కోట చారిత్రక విశిష్టత, నిర్మాణ శైలి, పురాతన వారసత్వ సంపదను ప్రత్యక్షంగా పరిశీలించారు. చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను యువతకు తెలియ జేయడంతో పాటు, మన వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించడమే హెరిటేజ్ వాక్ ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. నాగభూషణం తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్స వాన్ని పురస్క రించుకొని జిల్లాలో ని చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వివిధ కార్యక్రమాల ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఎం. వెంకటరత్నం, లెక్చరర్ షాజహాన్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


