ఓటర్ల జాబితా అవకత వకలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన
1 min read
కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీనామా చేయాలని డిమాండ్, కలెక్టర్ కు వినతి
అన్నమయ్య జిల్లా డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఓటర్ల జాబితా లో(సర్) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అన్నమయ్య జిల్లా డీసీసీ అధ్యక్షులు గాజుల భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పార్టీ నాయకులతో కలసి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రజా పిర్యాదు ల వేదికలో వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు స్థానిక బెంగు ళూరు బస్టాండ్ నందు ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గాజుల భాస్కర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లర్లు కు సంబంధించి అక్రమాలు జరిగాయని ఆరోపిం చారు. ఇందుకు బాధ్యులై న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ లో జరిగినట్లు వస్తున్న ఆరోపణలు, అవక తవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, జ్ఞానేశ్వర్ కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించా లని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని స్పష్టంచేశారు. ఇందుకు ప్రధాన ఎన్నికల కమీషనర్ బాధ్యత వహిస్తూ వైదోల గాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొండపల్లి ఆనంద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ పరిధిలో అన్ని రాష్ట్రాలలో నూ ఓట్ల చోరీ జరిగిందని విమర్శించారు. దీనివల్లే ఎన్డీఏ అధికారం లో కొనసాగుతొందని పేర్కొన్నారు. రానున్న 2029 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలొకి రావడం తద్యమని, అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష, ఏపీ సీసీ కిసాన్ ఉపాధ్యక్షులు సింగం రామ కృష్ణ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ సమీ రుద్దీన్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు మల్లిక, నాయకులు సయ్యద్ బాషా, రెడ్డి బాషా, ఇస్మాయిల్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు సమీర్, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు రవి, రాయ చోటి ఇంచార్జ్ అమీర్ భాష తో పలువురు నాయకులు పాల్గొన్నారు.



