తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లయన్ డా. రాయపాటి శ్రీనివాస్ ఎన్నిక
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: విజయవాడలోని ఎం.బి.వి.కె. ఆడిటోరియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం ప్రముఖ పురుషోత్తముడు సినిమా ఫేమ్ దర్శకులు రామ్ భీమన, తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి డి.వి. కళింగరాజు, మురళీకృష్ణ తదితర ప్రముఖులు, ప్రతినిధులు మరియు సినీ రంగ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ రంగ అభివృద్ధికి, ప్రతిభ కలిగిన యువ దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


