NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: కృష్ణమ్మ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఐటీడీపీ సభ్యులకు సూచించారు.కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు గట్టు తిలక్ అలాగే జనరల్ సెక్రెటర్ జి. రామాంజినేయులు ల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన ఐటీడీపీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ హాజరై ఐటీడీపీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు సభ్యులతో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సహకారంతో ఐటీడీపీ కమిటీల ఏర్పాటును పూర్తి చేసి, రానున్న రోజుల్లో సోషల్ మీడియా వేదికగా పార్టీని మరింత బలోపేతం చేయాలని కృష్ణమ్మ తెలిపారు.ఈ సమావేశంలో ఐటీడీపీ నాయకులు ,హెచ్. నాగరాజు, బి. కృష్ణ నాయుడు, కే. వీరేష్, వీరేష్ బాబు, బి. విజయ్, ఎం. చిదానంద, వి. కిరణ్ కుమార్, మున్వర్, సయ్యద్ భాష తదితరులు పాల్గొన్నారు.

About Author