పగిడ్యాల,నెహ్రూనగర్’లో మాసోత్సవాలు
1 min read
అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులు ఉండాలి
నందికొట్కూరు న్యూస్ నేడు: ప్రైవేట్ పాఠశాలల్లో కాదు అంగన్ వాడీ కేంద్రాల్లోనే చిన్నారులు ఉండాలని అంగన్వాడీ సూపర్వైజర్ ఎం శేషమ్మ అన్నారు. నంద్యాల జిల్లా పగిడ్యాల 7వ కేంద్రం మరియు నెహ్రూ నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం సూపర్వైజర్ శేషమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పగిడ్యాలలో జరిగిన కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి,డాక్టర్ అనిల్,ఏవో నాగేంద్ర కుమార్,గ్రామ నాయకులు రాజారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషణ మాసోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 7 వరకు కార్యక్రమాలు ఉంటాయని ప్రభుత్వం తల్లులకు ఇచ్చే పోషక విలువలతో ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని వారు అన్నారు.తర్వాత నెహ్రూనగర్ 3 వ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి టిడిపి సీనియర్ నాయకులు కట్టుబడి శ్రీనివాస నాయుడు హాజరయ్యారు.కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చిన్నారులకు గర్భవతులకు బాలింతలకు మంచి పోషకాహారం ఇస్తుందని వాటిని వినియోగించుకోవాలని శ్రీనివాస నాయుడు అన్నారు.తర్వాత ఆయన తల్లులకు,గర్భవతులు బాలింతలను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఫ్రాన్సిస్,లక్ష్మి, ఎంఎల్ హెచ్పి ,అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



