NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తుంగభద్ర జలాల దోపిడీని అరికట్టాలి

1 min read

కర్ణాటక పరిశ్రమల నీటి వినియోగంపై చర్యలు తీసుకోవాలి

రైతుల ప్రయోజనాలను పట్టించుకోకపోతే డ్యామ్ వద్ద ఆందోళన వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కె గిరి

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కె గిరి మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్‌లోని నీటిని కర్ణాటకలోని పరిశ్రమలు అధికంగా వినియోగిస్తున్నాయనే ఆరోపణలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రాయలసీమ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో తుంగభద్ర డ్యామ్ నీటిపై రైతులకు ఆంక్షలు విధిస్తున్న అధికారులు, పరిశ్రమల నీటి వినియోగంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు పంటలు సాగు చేసుకోవడానికి నీరు అడిగితే నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నారని, అదే సమయంలో పరిశ్రమలకు పెద్ద మొత్తంలో నీరు తరలిపోతున్నట్లు ఆరోపించారు.ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొని, డ్యామ్‌లో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతున్న పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని అధికారులు సమీక్షించాలని కోరారు. రాయలసీమ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర జలాలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కర్ణాటకలోని పరిశ్రమల నీటి వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నీటి వినియోగం జరుగుతున్నట్లయితే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు స్పందించి రైతుల పక్షాన నిలవాలని అన్నారు.తుంగభద్ర జలాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైతే రాయలసీమ రైతులందరినీ సమీకరించి డ్యామ్ వద్ద ఆందోళన చేపడతామని ఎస్‌కె గిరి హెచ్చరించారు.ఈ సమావేశంలో నాయకులు ఈరన్న, కాంత్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

About Author