NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తృటిలో తప్పిన ప్రమాదం.. శిథిలావస్థలో చెన్నకేశవ స్వామి ఆలయం

1 min read

పూజారి తాళం తీస్తుండగా ఊడిపడిన పైకప్పు పెచ్చులు.. భక్తుల్లో ఆందోళన

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని అత్యంత పురాతనమైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం ఆలయ పూజారి వెంకటేష్ గర్భగుడి తాళం తీస్తుండగా పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడటంతో ఆలయ పూజారి వెంకటేష్ తృటిలో ప్రమాదం తప్పింది.శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఈ పురాతన ఆలయం పైకప్పు ఇప్పటికే దెబ్బతిని, శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ పునరుద్ధరణ కోసం గతంలో దేవాదాయ శాఖ అధికారులు పరిశీలనకు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం జరగకముందే ఆలయాన్ని పునరుద్ధరించాలి. పురాతన ఆలయాన్ని పరిరక్షించి, భక్తులకు సురక్షితంగా దర్శనం కల్పించేలా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

About Author