NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళం మండలంలో పాఠశాలల పేరెంట్స్ కమిటీ ఎన్నికలు

1 min read

కౌతాళం, న్యూస్ నేడు: కౌతాళం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు సోమవారం ఘనంగా జరిగాయి. నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.- జిల్లా పరిషత్ కన్నడ పాఠశాల: చైర్మన్ గా దేవేంద్ర, వైస్ చైర్మన్ గా పల్లవికస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV): చైర్మన్ గా నాగమ్మ, వైస్ చైర్మన్ గా కుంటనహాల్ లక్ష్మి- ఎంపీపీ పాఠశాల (SW) శంఖాబేరి: చైర్మన్ గా దేవదాసు, వైస్ చైర్మన్ గా సునంద- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల: చైర్మన్ గా కిష్టప్ప, వైస్ చైర్మన్ గా రేణుక,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహకార సొసైటీ చైర్మన్ వెంకటపతిరాజు, టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీల పాత్ర కీలకమని అన్నారు. విద్యార్థుల నమోదు పెంచడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, హాజరు శాతం పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి బాలిక క్రమం తప్పకుండా బడికి వచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ టౌన్ అధ్యక్షుడు రాజానంద్, గిరి, రమేష్, లింగేష్, బిజెపి నాయకులు రామచంద్ర, మండల జన సేన రాంబాబు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author