NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మారుమూల పల్లె నుంచి డాక్టరేట్‌ వరకు..

1 min read

డా. రామచంద్ర సాహిత్య ప్రస్థానం

న్యూస్ నేడు, పత్తికొండ: ప్రతిభకు గ్రామీణ నేపథ్యం అడ్డంకి కాదని నిరూపిస్తూ, మారుమూల పల్లె నుంచి విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన డా. రామచంద్ర ఆంగ్ల సాహిత్య పరిశోధనలో డాక్టరేట్‌ పట్టా సాధించారు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే పరిశోధన, రచనా రంగాల్లో తన కృషిని కొనసాగిస్తూ విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు.కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని పెద్దహుల్తి గ్రామంలో జన్మించిన రామచంద్ర ప్రస్తుతం పత్తికొండలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో ఆంగ్లం PGTగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించడంతో పాటు సాహిత్యంపై ఉన్న ఆసక్తిని పరిశోధన వైపు మళ్లించి ఉన్నత విద్యను అభ్యసించారు.మహిళా పాత్రలపై విస్తృత పరిశోధనలో భాగంగా శ్రీ. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ G. M. సుందరపల్లి  పర్యవేక్షణలో “Divergent Women Characters in the Novels of Anita Nair” అనే అంశంపై పరిశోధన నిర్వహించారు.

అనితా నాయర్ నవలల్లో కనిపించే విభిన్న మహిళా పాత్రల వ్యక్తిత్వం, వారి సామాజిక నేపథ్యం, ఆలోచనా విధానం, జీవిత సంఘర్షణలు, సమాజంతో వారి సంబంధాలను పరిశోధనలో విశ్లేషించారు. సమకాలీన ఆంగ్ల సాహిత్యంలో మహిళా పాత్రల చిత్రణకు ఉన్న ప్రాధాన్యతను అధ్యయనం చేస్తూ తన పరిశోధనను కొనసాగించారు.ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసి డాక్టరేట్‌ పట్టా సాధించారు.బోధనతో పాటు పరిశోధనడా. రామచంద్ర బోధనా వృత్తితో పాటు పరిశోధన, రచనా రంగాల్లోనూ చురుకుగా కొనసాగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే సదస్సులు, సెమినార్లు, పరిశోధనా కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ అంశాలపై వ్యాసాలు, పరిశోధనా పత్రాలను రచిస్తున్నారు.ఆంగ్ల సాహిత్యం, మహిళా పాత్రల చిత్రణ, సమకాలీన సాహిత్య ధోరణులు తదితర అంశాలపై చేశారు.

About Author