NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురుకుల పాఠశాల చైర్మన్ గా జయంతి

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.ఎన్నికల అబ్జర్వర్ గా మండల విద్యాశాఖ అధికారి మద్దిలేటి హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు.పాఠశాల చైర్మన్ గా కే జయంతి,వైస్ చైర్మన్ గా డి స్వాములు, కమిటీ సభ్యులుగా రాఘవేంద్ర ఎస్తేర్ బాలరాజు బ్రహ్మం,మాధవి,ఉమా, కళ్యాణ్,వెంకటేశ్వరమ్మ, రాజశేఖర్ పుల్లయ్య,ప్రసన్న లక్ష్మిలను  విద్యార్థుల తల్లిదండ్రులు ఏగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటీ సభ్యులను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎంఈఓ సూచించారు. అదేవిధంగా మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.ఈ ఎన్నికలను నందికొట్కూరు రూరల్  సీఐ టి సుబ్రహ్మణ్యం మరియు ఎస్ఐ మల్లికార్జున సిబ్బంది పర్యవేక్షించారు.పగిడ్యాల మండలం లక్ష్మాపురం బాలికల గురుకుల పాఠశాల చైర్మన్ గా లక్ష్మాపురం వై గ్రేసమ్మ,వైస్ చైర్మన్ గా వేంపెంట జయంతి లను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ జయన్న,నాయకులు జంగాల పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

About Author