ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 29న మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యం, గుండె జబ్బుల నివారణ, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్సపై వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డా. ఎన్. చైతన్య కుమార్, డా. సి.ఎస్. తేజ నందన్ రెడ్డి, డా. బి స్ ప్రవీణ్ కుమార్ మరియు కార్డియోవాస్క్యులర్ అండ్ థొరాసిక్ సర్జన్ డా. వై.ఎస్.ఎన్. చంద్రశేఖర్ పాల్గొని గుండె ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించారు.గుండె జబ్బులను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ లక్షణాలను గుర్తించడం, అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించడం, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, పొగతాగడం, అధిక బరువు వంటి ప్రమాద కారకాలను నియంత్రించుకోవడం వంటి అంశాలపై వైద్యులు వివరించారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలి మార్పుల ప్రాధాన్యతను కూడా వివరించారు.కార్యక్రమంలో గుండె శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్న 8 మంది రోగులను ప్రత్యేకంగా సన్మానించారు. వారి గుండె చికిత్స, శస్త్రచికిత్స అనంతర కోలుకునే ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మానం పొందిన రోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. చికిత్సకు ముందు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, మెడికవర్ హాస్పిటల్స్‌లో పొందిన వైద్య సేవలు, వైద్యులు మరియు సిబ్బంది అందించిన సహకారం, శస్త్రచికిత్స అనంతరం తమ ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల గురించి వివరించారు. తమ చికిత్సలో వైద్యులు అందించిన భరోసా, మార్గదర్శకత్వం తమ కోలుకునే ప్రయాణంలో ఎంతో సహాయపడిందని తెలిపారు.ఈ సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, రోగుల సమక్షంలో ప్రత్యేక హార్ట్ చెక్ ప్యాకేజీని ప్రారంభించారు. గుండె ఆరోగ్యాన్ని ముందుగానే పరీక్షించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో ECG, 2D Echo, డాక్టర్ సూచన మేరకు TMT, Lipid Profile, Creatinine, RBS మరియు Cardiologist Consultation వంటి సేవలు ఉన్నాయి. రూ.6,500 విలువైన ఈ ప్యాకేజీని ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా రూ.999కే అందిస్తున్నారు. ఈ ఆఫర్ 31 అక్టోబర్ 2026 వరకు చెల్లుబాటు అవుతుంది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి గుండె వైద్య నిపుణులను సన్మానించారు. గుండె సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సమగ్ర వైద్య సేవలు అందించడంలో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ మరియు ఇతర విభాగాల సమన్వయం ఎంతో ముఖ్యమని తెలిపారు.


