NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పండుగ సీజన్‌కు ముందు అమెజాన్ భారీ విస్తరణ

1 min read

రూ. 2,800 కోట్ల పెట్టుబడితో 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు, 1.6 లక్షల ఉద్యోగాలు

హైదరాబాద్​, న్యూస్​ నేడు:  రాబోయే పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో రూ. 2,800 కోట్లకు పైగా పెట్టుబడితో చరిత్రలోనే అతిపెద్ద విస్తరణను ప్రకటించింది. ఇందులో భాగంగా 20 కొత్త ఫుల్‌‌ఫిల్‌మెంట్ కేంద్రాలు (రాయ్‌పూర్, రాంచీ, వారణాసిలలో తొలిసారిగా సహా), 6 కొత్త సార్ట్ సెంటర్లు మరియు 118 నగరాల్లో 150 కొత్త చివరి అంచె డెలివరీ స్టేషన్‌‌లను ప్రారంభించడంతో సంస్థ నిల్వ సామర్థ్యం 50% పెరిగి 64 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరుకుంది. భోజ్‌పూర్, బొకాజన్, నమ్‌సాయి, ఉఖ్రుల్ వంటి 12 కొత్త ప్రాంతాల్లో అమెజాన్ తన మొదటి డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేసి మెట్రోయేతర, టైర్-2, టైర్-3 నగరాలకు సేవలను వేగవంతం చేసింది. దీనికితోడు, 50కి పైగా నగరాల్లో 750 కంటే ఎక్కువ స్టోర్ల ద్వారా నడిచే ‘అమెజాన్ నౌ’ సేవలను విస్తరిస్తూ దేశంలోనే అతిపెద్ద ‘నిమిషాల్లో డెలివరీ’ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. ఈ భారీ విస్తరణలో భాగంగా పండుగ సీజన్ డిమాండ్‌ను అందుకోవడానికి 400 నగరాల్లో 1,60,000కు పైగా సీజనల్ ఉద్యోగ అవకాశాలను అమెజాన్ కల్పిస్తుండటమే కాకుండా, డెలివరీ భాగస్వాముల సంక్షేమం, బీమా మరియు పిల్లల విద్యార్థివేతనాల కోసం ‘సమ్మాన్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

About Author