సుస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
1 min read
బరువెంతైనా బలమే ఆయుధంగా,వివిధ కేజీల్లో భారీ బరువులెత్తి మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు
ఏలూరు యం ఎల్ ఎ బడేటి చంటి
ఏలూరు, న్యూస్ నేడు: పశ్చిమ ప్రస్థానం,ఏలూరుజిల్లా ప్రతి నిధి:బరువెంతైనా బలమే ఆయుధంగా వివిధ కేజీల్లో భారీ బరువులను ఎత్తి మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్లో సుస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ పోటీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీ (న్యూజివీడు) తరఫున ఏ. హర్షిత 86 గోల్డ్,జి.కవిత 75 సిల్వర్,సొంగ పూజిత 51 సిల్వర్,జె.వర్షిని 47బ్రోన్జ్,జి.సంయుక్త బ్రోన్జ్, కె.మహిత 53బ్రోన్జ్,టి.సుమిత్ర 55బ్రోన్జ్,పి. తేజస్విని65 బ్రోన్జి లుగా కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.శ్రీలక్ష్మి , పిడి సుశీల కుమారి, పిఈటి స్నేహలత వారిని అభినందించారు. అనంతరం 45, 49, 53, 57, 61, 69, 77, 86 కేజీల విభాగాలలో పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి 40మంది మహిళలు పాల్గొనగా 30 మంది ఎంపికయ్యారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదాన ఉత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) సతీమణి చేతుల మీదుగా విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బడేటి వెంకట్రామయ్య,ఇడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,సెట్వెల్ సీఈవో ప్రభాకర్,సాయి సెంటర్ డీడీ గుర్నామ్ సింగ్,డీఎస్ఓఎస్ఏ అజీజ్ మరియు బి.వి.షణ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.


