ప్యాపిలి మండలంలో ఎమ్మెల్యే కోట్ల పర్యటన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, పల్లెపండుగ–3.0 కార్యక్రమాల్లో భాగంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గురువారం ప్యాపిలి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారని ఎంపిడిఓ శ్రీనివాసరావు తెలిపారు.ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొంటారు.ఉదయం 9 గంటలకు డి.రంగాపురంలో రూ.10 లక్షలు, 9:30 గంటలకు రాచవాండ్లపల్లిలో రూ.10 లక్షలు, 10 గంటలకు రాంపురంలో రూ.10 లక్షలు, 10:30 గంటలకు నల్లమెకల్లపల్లెలో రూ.15 లక్షలు, 11 గంటలకు జక్కసానిగుంట్లలో రూ.10 లక్షలు, 11:30 గంటలకు హుస్సేనాపురంలో రూ.20 లక్షలు, మధ్యాహ్నం 12 గంటలకు బావిపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.


