హొళగుంద మండల విద్యాశాఖ కార్యాలయానికి కొత్త కళ
1 min read
పునరుద్ధరించిన కార్యాలయం ప్రారంభం.. ఆవరణలో మొక్కల నాటకం
హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి, పనులు పూర్తయిన అనంతరం నూతనంగా తీర్చిదిద్దిన కార్యాలయాన్ని సోమవారం పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-1 సుధారాణి, ఎంఈఓ-2 కబీర్ సాబ్, మండల విద్యాశాఖ అధికారులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మండల విద్యాశాఖ అధికారులు, ఎంఆర్సీ సిబ్బంది, ఉపాధ్యాయుల చేతుల మీదుగా మొక్కలు నాటారు. కార్యాలయ పునరుద్ధరణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన అధికారులు, విద్యాశాఖకు సంబంధించిన పరిపాలనా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతన కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు నాటడం మంచి పరిణామమని పేర్కొన్నారు.


