NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కు రాష్ట్ర స్థాయి ‘స్వచ్ఛ అవార్డు’

1 min read

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బంది ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బుట్టాయిగూడెంలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్ర స్థాయి ‘స్వచ్ఛ అవార్డు’  సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  బుట్టాయిగూడెంలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బంది తమ పాఠశాల సాధించిన రాష్ట్రస్థాయి ‘స్వచ్ఛ అవార్డు’ ను   సోమవారం  స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు తెలియజేసి తమ5 సంతోషాన్ని కలెక్టర్ తో పంచుకున్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మారుమూల గ్రామంలోని గిరిజన సంక్షేమ రెసిడెంటిల్ పాఠశాల రాష్ట్రస్థాయి  అవార్డు ను సాధించడం గొప్పవిషయమని,  జిల్లాలోని పాఠశాలలలకు స్ఫూర్తిదాయంగా నిలిచారన్నారు.  ఈ అవార్డును జిల్లాలో ప్రతీ పాఠశాల సిబ్బంది స్ఫూర్తిగా తీసుకుని రానున్న సంవత్సరంలో మరిన్ని రాష్ట్ర అవార్డులు సాధించేలా కృషి చేయాలన్నారు.  బుట్టాయిగూడెంలోని గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల సిబ్బంది ఇదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *