NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నర్సింగ్ విద్యార్థులు దోమల నిర్మూలన పై అవగాహన

1 min read

ఫీల్డ్ సర్వే చేసినప్పుడు ప్రజలకు దోమలపై అవగాహన కల్పించాలి

గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా:రోజా లలిత,అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు

ఆశ్రం మెడికల్ కళాశాల నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులకు   కీటకాలు వలన వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:నర్సింగ్ విద్యార్థులు దోమలు గూర్చి దోమ ద్వారా వచ్చే వ్యాధులు గూర్చి దోమల నిర్మూలన పద్ధతులు గూర్చి సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఫీల్డ్ సర్వే చేసినప్పుడు ప్రజలకు దోమల గూర్చి అవగాహన కల్పించాలని గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజా లలిత మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు సూచించారు స్థానిక గోపన్నపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ట్రైనింగ్ నిమిత్తం వచ్చిన ఆశ్రం మెడికల్ కళాశాల నర్సింగ్  విద్యార్థులకు   కీటకాలు కుట్టడం వలన వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించి మాట్లాడుతూ కీటకాలలో అత్యంత ప్రమాదకరమైన కీటకం దోమని , ప్రపంచంలో 3000 రకాల దోమలు ఉన్నప్పటికీ 3 రకాల దోమల వల్లే  మనకు వ్యాధులు సంక్రమిస్తాయని, ఆడ అనాఫిలిస్ దోమ వలన  మలేరియా ఆడ ఎడిస్ దోమ కుట్టడం వలన  డెంగ్యూ చికెన్ గునియా జికా, ఆడ క్యూలెక్స్ దోమ కుట్టడం వలన బాధకాలు, మెదడువాపు,  వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమింపజేసే ప్రమాదకరమైన కీటకమని కోట్లాది ప్రజలు దోమల ద్వారా వచ్చే వ్యాధులు తో బాధపడుతున్నారని, అనేక లక్షల మంది చనిపోతున్నారని కాబట్టి దోమల నిర్మూలన మనందరి బాధ్యతని, మనకి ఎక్కువగా హాని చేసే దోమలు డెంగ్యూ కారక దోమ, మలేరియా కారక దోమ  మా గృహాలు నిల్వ చేసే మంచి నీళ్లలో పెరుగుతాయని కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డే ఆచరించాలని , దోమలు పెరిగే స్థలాల డ్రమ్ములు నీళ్ల తొట్టెలు, పూల కుండీలు, కొబ్బరి బొండాలు టైర్లు, రుబ్బురోలు పల్లపు నీటి ప్రాంతాలు  నీరు నిలవ లేకుండా చూసుకోవాలని నర్సింగ్ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగ్యూ దోమ ఎడిష్ దోమ పగటి పూట, మలేరియా ఆడ అనాఫిలష్ దోమ రాత్రి కుడుతుందని సూచించారు.  ఈ కార్యక్రములో పబ్లిక్ హెల్త్ నర్సాఫీసర్ సత్యవతి  హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం  హెల్త్ అసిస్టెంట్స్ రమేష్ బాబు ఆదినారాయణ, ఇర్ఫాన్   , నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు సూచించారు .  ఈ కార్యక్రములో పబ్లిక్ హెల్త్ నర్సాఫీసర్ సత్యవతి  హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం  హెల్త్ అసిస్టెంట్స్ రమేష్ బాబు ఆదినారాయణ, ఇర్ఫాన్   , నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *