NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాప్ ద్వారా ఎరువుల అమ్మకాల వస్తున్న రైతుల ఇబ్బందులను తొలగించాలి

1 min read

వ్యవసాయ శాఖ ఏడి సుబ్బారావు,మండల వ్యవసాయ అధికారులకు వినతి పత్రం

రైతులకు సరిపడా ఎరువుల అందించాలి

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లింగపాలెం యాప్ ద్వారా ఎరువుల అమ్మకాల్లో వస్తున్న రైతుల ఇబ్బందులను వెంటనే తొలగించాలని, రైతులకు అవసరమైన సరిపడా ఎరువులు అందించాలని, పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో లింగపాలెం మండలం రంగాపురంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు.స్థానిక కళ్యాణ మండపం వద్ద ఎరువుల యాప్ పై వ్యవసాయ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సు వద్ద వ్యవసాయ శాఖ ఏడి సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలు వలన ఎరువులు అందక నష్టపోతున్నామంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, కోకో రైతుల సంఘం జిల్లా నాయకులు మోరంపూడి సుబ్రహ్మణ్యం, రైతులు ఓబిలినేని రామచంద్రం, బొల్లిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తుంటే సరిపడా అవసరమైన ఎరువులు అందించకపోవడం వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా కొనుగోలు వలన ఓటీపీలు కూడా తెలియక గంటల తరబడి ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. యూరియా, డిఎపి వంటి ఎరువులు అమ్మకాల్లో సీలింగ్ పెట్టడం వలన రైతులకు సరిపడా అందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తగ్గించుకోవడం కోసం ఎరువులు అమ్మకాలు కుదింపులో భాగమేనని చెప్పారు. సకాలంలో ఎరువులు వెయ్యకపోవడం వలన దిగుబడులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావం లేకపోతే రైతులు ఎరువులు కోసం రోడ్ల ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు. లింగపాలెం మండలంలో  ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి, మిర్చి, నాటు పొగాకు, మొక్కజొన్న, వరి వంటి పంటలను రైతులు పండిస్తున్నారని, ఈ పంటలకు అవసరమైన ఎరువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు అందించాలని డిమాండ్ చేశారు. టెన్షన్ ఎరువుల ధరలు రైతులకు భారంగా ఉందని, సాగు ఖర్చులు పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తోందన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యలపై గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆయా పంటల రైతులు గరిమెళ్ళ సత్యనారాయణ, పాకలపాటి సుబ్బారావు, జి.శివన్నారాయణ, బీవీ రత్తయ్య, ఎన్.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *