NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రావి వరలక్ష్మి (91)పార్దివదేహం మెడికల్ హాస్పిటల్ కి దానం

1 min read

జీవితం చివరి దశలో  సమాజానికి ఉపయోగపడే గొప్ప నిర్ణయం

సమాజానికి వెలుగునిచ్చే మహోన్నత సేవలను పలువురు కొనియాడారు

పశ్చిమగోదావరి జిల్లాప్రతినిధి, న్యూస్ నేడు: భీమవరం గునుపూడికి చెందిన రావి వరలక్ష్మి మంగళవారం  కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. వరలక్ష్మి జీవితం చివరి దశలో కూడా సమాజానికి ఉపయోగపడే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తన దేహాన్ని వైద్య విద్యార్థుల అభ్యాసం కోసం దానం చేయాలని ముందుగానే ఒప్పంద పత్రాలపై సంతకం చేసి తన మహోన్నత మనసును చాటుకున్నారు. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సహకారం అందించి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ కు వరలక్ష్మి పార్థివ దేహాన్ని నిబంధనల ప్రకారం అందజేశామని ఆమె కూతురు కొల్లా సాయి సుజాత, మనవరాలు ఉలా సాయి సౌజన్య తెలిపారు. నేత్రదానం, అవయవదానం,దేహదానాలు పవిత్రమైనవి. ఇవి సమాజానికి వెలుగునిచ్చే మహోన్నత సేవలను పలువురు కొనియాడారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *