మదనపల్లెలో చైర్మన్ తో సహా అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది
1 min read
మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగర వేయడమే లక్ష్యం
పార్టీ నాయ కులు ఆనంద్, డా. ఎస్ కె బాషా స్పష్టం
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్ర మైన మదనపల్లె లో చైర్మన్ అభ్యర్థి తో సహా 48 వార్డు లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని డిసిసి ఉపాధ్యక్షులు కొండుపల్లి ఆనంద్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కే భాష లు ప్రకటించారు. గురువారం శీనా టీ స్టాల్ ఏదురుగా స్థానిక మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మదనపల్లె మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేయడమే లక్ష్యమని స్పష్టంచేశారు. ఇప్పటికే బలమైన అభ్యర్థుల ను పోటీకి నిలిపే విధంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమను సంప్రదిస్తే నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి ద్వారా డిసిసి మరియు ఏపిసిసి ల దృష్టికి తీసుకు వెళ్లి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి నిలి పేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ లో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నత పదవులను అలంక రించారనె విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఈ కార్య క్రమం లో పార్టీ నాయకులు సలీం, భాను, షబానా, నజీమ్ షేక్, తాజూన్, షమీం షేక్, అక్బర్, మంజునాథ్, సాదిక్, గణేష్ లు పాల్గొన్నారు.


