NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం జల సంరక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలి!

1 min read

రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించాలి

విద్యుత్ పేరుతో నీటి విడుదలలు, సాగర్‌కు తరలింపుపై ఆందోళన: క్యారీ ఓవర్ నిల్వలను కాపాడాలని డిమాండ్

పట్టిసీమ ఉన్నా శ్రీశైలంపై ఒత్తిడి ఎందుకు? జలవనరుల సమన్వయ వినియోగానికి పిలుపు

సీమ గొంతు ఎండకముందే మేల్కొనండి: శ్రీశైలం జలాల పరిరక్షణకు రైతుల డిమాండ్

ముఖ్య ఇంజనీర్‌కు వినతిపత్రం.. కర్నూలులో బొజ్జా దశరథ రామిరెడ్డి నేతృత్వంలో తరలివచ్చిన కర్నూలు, నంద్యాల, కడప రైతులు

కర్నూలు, న్యూస్​ నేడు: శ్రీశైలం జలాశయ నీటి నిర్వహణలో రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాల తాగునీటి, సాగునీటి హక్కులను పరిరక్షించాలని  రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య ఇంజనీర్‌, కర్నూలును  కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉద్దేశించిన వినతిపత్రాన్ని అందజేశారు.వినతిపత్రంలోని అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ముఖ్య ఇంజనీర్‌ హామీ ఇచ్చారు.

“ప్రకటనలు కాదు..తక్షణ చర్యలు కావాలి!

శ్రీశైలం నీటిని సంరక్షించండి.. రాయలసీమ దాహాన్ని తీర్చండి!” అని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో సమితి ఉపాద్యక్షులు యర్రం శంకర్ రెడ్డి,  ఏరువ రామచంద్రారెడ్డి, రాయలసీమ విద్యా వంతుల వేదిక నాయకులు అరుణ్, DTF  నాయకులు రత్నం ఏసేఫ్, కడప జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు రంగారెడ్డి,  కెసి కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితి నాయకులు గణపతిరెడ్డి, ప్రముఖ న్యాయవాది నాగలక్ష్మి, ప్రజా హక్కుల వేదిక నాయకులు డేవిడ్, యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, SRBC పరిరక్షణ సమితి నాయకులు మురళి మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *