NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముదినేపల్లి మండల బిజెపి పార్టీ జడ్పిటిసి గా తిరువీధుల శారద నామినేషన్ దాఖలు

1 min read

పార్టీలకతీతంగా కొన్నేళ్లుగా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్న

విద్యావేత్త,సామాజికవేత్త,బీసీ మహిళకు అవకాశం కల్పించండి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కాకర వాడ గ్రామం నుంచి ముదినేపల్లి మండలం నుంచి జడ్పిటిసిగా సామాజికవేత్త,హైకోర్టు అడ్వకేట్ కూటమి పార్టీ నాయకురాలు తిరువీధుల శారద  బిజెపి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.దానిలో భాగంగా ఏలూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పోటీలో ఉన్నానని కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి పార్టీ పెద్దలు  కొన్నేళ్లుగా పనిచేస్తున్న  వెనుకబడిన కులానికి చెందిన  తనకు ఒక బీసీ మహిళగా అవకాసం కల్పించాలని, మా కష్టాన్ని గుర్తించాలని  కోరారు. ఎంతో కాలం నుండి కూటమి ప్రభుత్వం లో పనిచేస్తున్నానని ఆల్ ఇండియా ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనారిటీ  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యురాలుగా జిల్లా ప్రజలకు,రాష్ట్ర ప్రజలకు సుపరిచితురాలని తెలియజేశారు. ఏలూరు జిల్లా వాసులు మరియు కైకలూరు నియోజకవర్గం ప్రజలుకు తన సేవలో అందించాలని తెలిపారు. ముదినేపల్లి మండలంలో ఎస్సీలు,బీసీలు,ఎస్టీలు, మైనారిటీలు నాలుగు మండలాలలో ఎంతోమంది తనకు మద్దతుగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ,బిజెపి పార్టీ కానీ కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా  తనకు ముదినేపల్లి మండలం నుంచి జడ్పిటిసిగా  అవకాశం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో పని చేసిన నాయకులకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలుసని,ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే ఆశాభావంతోనే కూటమి పార్టీకి మద్దతుగా బిజెపి తరఫున పోటీ చేస్తున్నానని తనకు కూటమి ప్రభుత్వం ముదినేపల్లి మండలం జడ్పిటిసిగా అవకాశం కల్పించాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *