NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

6వ వార్డులో డ్రైనేజీ సమస్య.. ప్రజలకు దోమల బెడద!

1 min read

బసవేశ్వర గుడి సమీపంలో పేరుకుపోయిన చెత్త – అధికారులు వెంటనే స్పందించాలని మాజీ ఎంపీటీసీ బడేఘర్ అతావుల్లా విజ్ఞప్తి

హొళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద గ్రామ పంచాయతీ పరిధిలో 6వ వార్డు బసవేశ్వర గుడి సమీపంలో డ్రైనేజీ చెత్తతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగి, దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీని శుభ్రం చేయించాలని మాజీ ఎంపీటీసీ బడేఘర్ అతావుల్లా కోరారు. చెత్తను తొలగించి, మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, డీఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని మాజీ ఎంపీటీసీ బడేఘర్ అతావుల్లా కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *