NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసేందుకే జనసేన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం 

1 min read

కె.కోట జడ్పిటిసి అభ్యర్థి సాధనాల.సుబ్బలక్ష్మి , తనయుడు సాధనాల.ప్రసాద్

దేశ సేవ చేసిన కుటుంబానికి అవకాశం ఇవ్వండి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలతో నిస్వార్ధ హృదయంతో ప్రజలకు సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన కామవరపుకోట జడ్పిటిసి అభ్యర్థి సాధనాల.సుబ్బలక్ష్మి తనయుడు  సాధనాల.ప్రసాద్ నామినేషన్ వేసిన సందర్భంగా మీడియాకు తెలిపారు. తన తల్లి సాధనాల.సుబ్బలక్ష్మి చేత కామవరపుకోట జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేయించేందుకు ఏలూరు జిల్లా పరిషత్ కు వచ్చినట్లు వారు తెలిపారు. నామినేషన్ పూర్తి అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆదేశాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, దేశ సేవ చేసిన కుటుంబానికి అవకాశం కల్పించాలని  అన్నారు. తన తల్లి సాధనాల.సుబ్బలక్ష్మి ని ఎన్నికల్లో గెలిపించడం ద్వారా కామవరపుకోట మండలం అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి కామవరపుకోటలో జరిగిన దాఖలాలు లేవని వాపోయారు. తాను మిలిటరీలో ఇరవై సంవత్సరాలు పనిచేసినట్లు తెలిపారు. జనసేన జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మాతృమూర్తి సాధనాల.సుబ్బలక్ష్మిని గెలిపించాలని మన మండల అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు. జనసేన పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో మేమంతా కట్టుబడి ముందుకు సాగుతామన్నారు. కామరకోట మండల ప్రజల ఆదరణతోనే తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *