NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడుమూర్’లో 4.5 కేజీల బాలుడు జననం

1 min read

పిహెచ్ సీ మెడికల్ ఆఫీసర్  వ్యోమకేష్..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది.మిడుతూరు గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి భార్య బోయ ఉదయలక్ష్మి నెలల గర్భిణి శుక్రవారం ఉదయం కడుమూరు ఆసుపత్రికి రాగా 10.06 నిమిషాలకు ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ బిడ్డ 4.5 కేజీల భారీ బరువు గల మగ బిడ్డ సాధారణ కాన్పు (నార్మల్ వెజైనల్ డెలివరీ) జరిగిందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పి హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వ్యోమకేష్ తెలిపారు.పుట్టిన వెంటనే బిడ్డ సురక్షితంగా ఏడవడం జరిగింది.ప్రసవానికి సంబంధించిన అన్ని దశలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు నాగరత్నమ్మ,రాధా, సౌజన్య,ఏఎన్ఎం లు కళ్యాణి,సుమిత్ర మరియు ఆశా కార్యకర్తలు శారద, ప్రభావతి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *