5వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థినిగా ఈడిగ గీత నామినేషన్
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 5వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థినిగా ఈడిగ గీత గురువారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆమె నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బయలుదేరిన ఈడిగ గీత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. శివరుద్ర కుమార్‌ను కలిసి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం ఈడిగ గీత మాట్లాడుతూ, 5వ వార్డు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. వార్డు అభివృద్ధితో పాటు పత్తికొండ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తనకు అండగా నిలిచి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈడిగా పెట్రోల్ బంక్ శ్రీనివాసులు, పల్లె పవన్ కుమార్, ఉప్పర వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


