49 బన్నూరులో తెదేపా ఇంటింటి ప్రచారం
1 min read
ఎంపీటీసీ అభ్యర్థి హుస్సేన్ భాషను గెలిపించండి..
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో ఎంపిటిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూదేకుల హుస్సేన్ భాషను గెలిపించాలని మిడుతూరు మండల టిడిపి క్లస్టర్ ఇన్చార్జి కమతం రాజశేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. బన్నూరులో శనివారం సాయంత్రం మాసపేట ఎంపీటీసీ అభ్యర్థి హుస్సేన్ భాష మరియు జడ్పిటిసి అభ్యర్థికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి రాజశేఖర్ రెడ్డి, వీరారెడ్డి,సర్వోతమ్ రెడ్డి ప్రజలకు వివరించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రానున్న రోజుల్లో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారు అన్నారు.అభివృద్ధిని చూసి ఓటు వేయండి ఎంపిటిసి అభ్యర్థిని గెలిపిస్తే ఈ నాలుగు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని టిడిపి అభ్యర్థి హుస్సేన్ భాష అన్నారు.ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, సోఫీ సాహెబ్,వేణుగోపాల్ రెడ్డి,వెంకటరామి రెడ్డి, గోపాల్ రెడ్డి,శబ్బు, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



