NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకొని  కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ మరియు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117ఎస్ల సంయుక్త ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలను నిర్వహించారు.లయన్స్ జిల్లా చైర్‌పర్సన్ మరియు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రపంచ శాంతి, ఐక్యత, సేవాభావం, మానవతా విలువలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి ప్రాముఖ్యత, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సహకారం, మానవ హక్కులు, దేశాల మధ్య స్నేహభావం పై  వ్యాసరచన పోటీలను జూనియర్, సీనియర్ విభాగాల్లో  నిర్వహించారశాంతి, ప్రేమ, మానవత్వం అనే విలువలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి ఆశయాలను ఆచరణలోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *