NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్

1 min read

కర్నూలు నగరపాలక సంస్థ ఓటరు జాబితాలో పేరుండి, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికీ అవకాశం

అక్టోబర్ 27న దామోదరం సంజీవయ్య మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటు

పోలింగ్ సిబ్బంది, పోలీసులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం

మున్సిపల్ ఓటరు జాబితాలోని వివరాలు, ఎన్నికల విధుల ఉత్తర్వులు తప్పనిసరి

అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు, న్యూస్​ నేడు: శనివారం కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితాలో పేరుండి, కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించే అర్హులైన ఉద్యోగులు, పోలీసు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 27వ తేదీన ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని పాత కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య మెమోరియల్ పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చల్లా ఓబులేసు తెలిపారు.

నవంబర్ 1న పోలింగ్.. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్విభజన అనంతరం 68 వార్డులు ఉన్నాయని, మొత్తం 4,79,861 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 487 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నవంబర్ 3వ తేదీన అథెనా స్కూల్‌లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *