కూటమిని ఆదరించి అభివృద్ధి కి బాటలు వేయండి
1 min read
రెండవ వార్డు జనసేన అభ్యర్థి ని తమ్మిశెట్టి కళావతి
వార్డు లో ముమ్మర ప్రచారం
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : త్వరలో జరుగ బోవు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ని ఆదరించి అభివృద్ధికి బాటలు వేయాలని రెండవ వార్డ్ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిని తమ్మిశెట్టి కళావతి పేర్కొన్నారు. శనివారం వార్డు పరిధిలో పార్టీ శ్రేణులతో కలిసి ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా తమ్మిశెట్టి కళావతి మాట్లాడుతూ 2వ వార్డు పరిధిలో దినసరి కూలీలు, కార్మికులు,మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో జీవిస్తు న్నారన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఈ వార్డులో ఎటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగలేదన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారధ్యంలో వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కూటమి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు నిలిచారని ఆయన ఎంతో చురుకైన నాయకుడని తెలిపారు.ప్రజలు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే రెండో వార్డు అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానన్నారు. అనంతరం చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీరభాస్కర్ మాట్లాడుతూ రెండవ వార్డు సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన తమ్మిశెట్టి కళావతికి మద్ధతుగా నిలవాలన్నారు. వార్డులో సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణా నికి ప్రత్యేక చొరవ చూపారన్నారు.కావున ఓటర్లు నవంబర్ ఒకటో తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి సైకిల్ గుర్తుపై,రెండవ వార్డ్ జనసేన అభ్యర్థిని తమ్మిశెట్టి కళావతికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి నర సింహులు,శేఖర్ రెడ్డి,నాగార్జున రెడ్డి,కళావతమ్మ,కృష్ణమ్మ,వెంకట శివ, అన్నపూర్ణమ్మ,విష్ణు,రామయ్య,చైతన్య లు పాల్గొన్నారు.


