ఇండియా పోస్ట్ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ముగింపు వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ ఉద్యోగులకు బిజినెస్ & మార్కెటింగ్ స్కిల్స్ పై మూడు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ను 22 నుండి 24 అక్టోబర్ 2026 వరకు కళాశాల ప్రాంగణంలో విజయవంతంగా నిర్వహించింది.పీఎస్ గ్రూప్ ‘బి’ / ఏఎస్పీలు / ఐపీలకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఎంజీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్లు బి. నాగా నాయక్, బి.పి. వెంకట్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎం గిరిధర్ కుమార్, వైస్ ప్రిన్సిపల్కన్వీనర్ గా వ్యవహరించడంతో పాటు రిసోర్స్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. మరో కీలక వనరులుగా డా. కె. నాగరాజు, ప్రొఫెసర్ జి. శశి కుమార్, డాక్టర్ హెచ్ ఎస్ అఫ్జల్ భాష మరియు డాక్టర్ సి నాగ గణేష్ లు వ్యవహరించారు.ఇందులో కర్నూలు రీజియన్ పరిధిలోని 80 మంది పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు. వారికి మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్లను సంతృప్తి పరచడం, వ్యాపారాన్ని ఎలా పొందాలి మరియు నిలబెట్టుకోవాలి అనే అంశాలపై రిసోర్స్ పర్సన్స్ లోతైన శిక్షణ ఇచ్చారు.పోస్టల్ డిపార్ట్మెంట్ ముఖ్య అతిథులు బి. నాగా నాయక్, బి.పి. వెంకట్ రెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో పోల్చుకుంటే ఈ కళాశాలలో మెరుగైన శిక్షణ అందిందని, మార్కెటింగ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్స్ పై లోతైన అవగాహన కల్పించారు తద్వారా మా రోజు వారి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ, ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ కు అవసరమైన ఎటువంటి సహాయం అందించడానికి జి. పుల్లయ్య కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇండియా పోస్ట్ సేవలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.


