జెడ్పిటిసి అభ్యర్థుల నామినేషన్స్ ఆమోదం…
1 min read
వెలుగోడు , న్యూస్ నేడు: వెలుగోడు మండల జిల్లా ప్రాదేశిక సభ్యుల నామినేషన్స్ ను శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నంద్యాల డిగ్రీ కాలేజీ ఆడిటోరియం నందు నిర్వహించిన పరిశీలన లో అన్నింటిని ఆమోదించారు. టిడిపి తరుపున బి. రమణారెడ్డి , బి. జె. పి తరుపున బుడ్డా శ్రీకాంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ తరుపున ఎస్. అక్బర్ షాహెబ్ , భారత చైతన్య యువజన పార్టీ తరుపున సీనియర్ జర్నలిస్ట్ ఎస్. రఘు రాముడు యాదవ్ మరో ఇద్దరు బరిలో ఉన్నారు.ఉపసంహారణ తర్వాత ఎవరు ఎన్నికల బరిలో నిలిచేది బహిర్గతం కాగలదు.


