NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన

1 min read

అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు

గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్:శరణ్య

వైద్య శిబిరాన్ని సందర్శించి, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వాతావరణం మారుతున్నప్పుడు ఆ వాతావరణానికి  అనుగుణమైన వ్యాధులకు మనిషి బాధపడే అవకాశం ఉందని వర్షాకాలం ముగిసి శీతాకాల ప్రారంభ దశలో మనిషి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు గురయ్యే అవకాశం ఉందని కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే. గోవిందరావు సూచించారు భీమడోలు మండలం గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వైద్యాధికారి డాక్టర్ శరణ్య సూచనమేరకు , గుండుగొలను గ్రామంలో   104 వైద్య శిబిరాన్ని సందర్శించి , ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లోపం వలన, కలుషితమైన ఆహారము, నీరు త్రాగడం ద్వారా టైఫాయిడ్ జ్వరాలు, నీళ్ల విరోచనాలు, కామెర్లు  తదితర వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని  అలాగే పరిసరాల పరిశుభ్రత లోపించడం వలన దోమలు వృద్ధి చెంది తద్వారా డెంగు మలేరియా చికెన్ గునియా వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.  ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు మేక శ్రీనివాసరావు,రమేష్ బాబు, చందు కుమార్,కోటమ్మ,శశికళ  ఆశా కార్యకర్తలు,జ్యోతి, కృష్ణవేణి, రాధిక 104 సిబ్బంది లక్ష్మణరావు, శిరీష, రజిత తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *